🔔 కృష్ణం వందే 🔔

July 16, 2025

🌿 ఒక రాజు గారు కృష్ణునియందు తీవ్ర భక్తి కలిగి వుండేవారు.శ్రీకృష్ణుని పేరు తలవకుండా ఏ కార్యము చేసేవాడు కాదు.

🌸 ఆ రాజుగారిలో ఎంత భక్తి వున్నా పూర్వ జన్మ కర్మల ఫలితాలనుi అనుభవించక తప్పలేదు.

🌿ఆ రాజావారికి అనేక తీవ్ర వ్యాధులు సంక్రమించాయి. ఎన్ని చికిత్సలు జరిపినా నయంకాలేదు.

🌸చివరకు పెద్ద కుమారునికి పట్టం కట్టి , తాను మంచం పట్టాడు.
అయినా కృష్ణుని నామ జపం మాత్రం మరువ లేదు.

🌿”కృష్ణా!కృష్ణా! నాకు ముక్తి కలిగించు.. అని ప్రార్ధిస్తూనే వుండేవాడు.

🌸ఒకనాడు ఒక సాధువు రాజ మందిరానికి వచ్చాడు. రాజుగారు ఆ సాధువు తో “స్వామీ వ్యాధి తీవ్రతని భరించలేక పోతున్నాను.

🌿 ఈ జీవితం ముగిసిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను.అయినా ప్రాణం పోవటల్లేదని కుమిలిపోయాడు.

🌸సాధువు ,రాజుని ఓదార్చి అన్నదానం చేస్తున్నావా?’అని అడిగాడు.

🌿’అవును స్వామీ ! ఎప్పుడు ఎవరు ఆకలి అని వచ్చినా వారికి లేదనుకుండా కడుపునిండా పెట్టి అన్నదానం జరిపిస్తున్నాను అన్నాడు.

🌸”ఇంక మీద అలా చేయకు. వారి పూర్తి ఆకలి తీరేలా కాకుండా అర్ధాకలితో వుండేలా అన్నదానం చెయ్యి.. నీ ఆయువు తీరుతుంది అన్నాడు సాధువు.

🌿”స్వామి! అది ఇంకా పాపం కదా, వ్యాధి తీవ్రమై బాధపడాల్సివస్తుందేమో అని అడిగాడు రాజు.

🌸’రాజా! అర్ధాకలితో వున్న వారు నీకు శాపమిస్తారు, అవి ఫలించి నీ ఆయువు తీరుతుంది, అన్నాడు సాధువు.

🌿సాధువు చెప్పినది తనకి నచ్చక పోయినా, సాధువు చెప్తున్నాడు కదా అని అర్ధాకలిగానే అన్నదానం చేయమని ఆదేశించాడు.

🌸సగం కడుపునిండిన వారందరూ రాజును శపించారు.అయినా రాజు ప్రాణాలు పోలేదు.

🌿వ్యాధి తీవ్రతతోను, శాపాలతోను బాధపడుతున్న సమయంలో రాజు వద్దకి సాధువు మళ్ళీ వచ్చాడు.

🌸’ స్వామీ! మీరు చెప్పినట్టు చేసినా ప్రాణాలు పోలేదు ‘అన్నాడు రాజు.

🌿”రాజా ! వస్తున్న మార్గం లోనే గమనించాను. నీ సేవకులందరూ ‘అచ్యుతా, అనంతా, అంటూ కృష్ణుని పేరు చెప్పి అన్నదానం చేస్తున్నారు.

🌸పరంధాముని నామం జపిస్తే ఆయువు తీరదు.భగవంతుడు వారి చేయి వదలడు.

🌿ఇంక మీద నీవు భగవంతుని నామం జపించకు, సేవకులను కూడా మానివేయమని చెప్పు, నీ ఆయువు తీరి పోతుంది. “అన్నాడు.

🌸అయినా రాజు , “నా కృష్ణుని పేరు జపించడం వలన నా బాధలు ఎక్కువైనా పర్వాలేదు, నా కృష్ణుని నామ జపం మాత్రం వదలను’అన్నాడు ధృఢంగా.

🌿రాజు యొక్క అచంచల భక్తిని, మనోధృడత్వాన్ని చూసిన సాధువు కృష్ణుని గా ప్రత్యక్షమై, రాజుగారి సకల బాధలు తొలగించి ,

🌸సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని
అనుగ్రహించాడు.ఆ రాజుగారు మరింత భక్తి శ్రధ్ధలతో దాన ధర్మాలు చేసి తరించాడు… 🙏

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

Article Categories:
Stories

Leave a Reply