ప్రారంభ తేది: జూలై 25, 2025
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం (Sravan Masam) అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. చాంద్రమానం ప్రకారం ఇది ఐదవ తెలుగు మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్న పౌర్ణమి నాడు ఈ మాసం మొదలవుతుంది. ఈ మాసానికి విశిష్టత కలగడానికి ప్రధాన కారణాలు:
శ్రావణ మాస విశిష్టతలు:
🔹 శివుడికి ప్రీతికరమైన మాసం:
శివుడు హాలాహల విషాన్ని సేవించిన మాసం ఇది. అందుకే శ్రావణ సోమవారాలు ఎంతో శుభప్రదమైనవి. శివలింగాభిషేకం, రుద్రాభిషేకం, శివ స్తోత్రాలు ఈ మాసంలో చేయడం శివుడి కృపను పొందేందుకు ఉత్తమ మార్గం.అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు
🔹 విష్ణువుకు ప్రీతికరమైన మాసం:
శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం ‘శ్రవణం’. ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు, విష్ణు సహస్రనామ పఠనం వంటివి ఎంతో ఫలప్రదం.
🔹 లక్ష్మీ దేవికి ప్రీతికరమైన కాలం: .
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళ్యమూ, ఐశ్వర్యమూ కలుగుతాయని విశ్వాసం.
🔹 వ్రతాల మాసం:
మహిళలకైతే ఇది పవిత్ర మాసం. వ్రతాలు, నోములు అధికంగా ఈ మాసంలో ఉంటాయి. ఇది సౌభాగ్య ప్రదమైన మాసంగా పరిగణించబడుతుంది.
అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు సైతం ఈ మాసం ఎంతో విశిష్టమైనది.
శ్రావణ మాసంలో ముఖ్యమైన వ్రతాలు, పండుగలు:
🌸 వ్రతాలు:
- శ్రావణ సోమవార వ్రతం – శివుడి కోసం
- వరలక్ష్మీ వ్రతం – శుభ శుక్రవారం
- మంగళ గౌరీ వ్రతం – మంగళవారాల్లో
- సత్యనారాయణ వ్రతం – విష్ణువు కోసం
🎉 పండుగలు:
- నాగ పంచమి
- శ్రీకృష్ణ జన్మాష్టమి
- రాఖీ పౌర్ణమి
మరిన్ని విశేషాలు:
- ఈ మాసంలో తిథులకంటే ప్రత్యేక రోజులకు (అష్టమి, నవమి, అమావాస్య) అధిక ప్రాముఖ్యత ఉంటుంది.
- .ఇవి కాకుండా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభ కార్యాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు. ఇక శ్రావణ మాసం వర్ష రుతువుతో ప్రారంభమవుతుంది. వర్షాలు బాగా కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కూడా రైతులు వేడుకుంటారు.