🪷ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు – జయమంగళం నిత్య శుభమంగళం
🪷వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి – జయమంగళం నిత్య శుభమంగళం
🪷శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు – జయమంగళం నిత్య శుభమంగళం
🪷ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు – జయమంగళం నిత్య శుభమంగళం
🪷చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను – జయమంగళం నిత్య శుభమంగళం
🪷తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
🪷మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
🪷కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్.
🪷మరొక పద్యం కూడా విద్యార్థులకు ఉచితమైనది.
🪷తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!
🪷ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము
🪷సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి .
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
