గణేశ చతుర్థి పూజా విధానం, వ్రత కల్పం (తెలుగు)

August 14, 2025

ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥

అయం ముహూర్తస్సుముహూర్తోఽస్తు ।
తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి, సుముహూర్తోఽస్తు ।

యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా ।
తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళమ్ ॥

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ।
యేషామిందీవరశ్ష్యామో హృదయస్థోజనార్థనః ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహమ్ ॥

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥

ధూమ్రకేతు-ర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండ-శ్శూర్పకర్ణో హేరంబ-స్స్కందపూర్వజః ॥

షోడశైతాని నామాని యః పఠే-చ్ఛృణు-యాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥

అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి ।
సర్వవిఘ్నచ్చిదేతస్మై శ్రీ మహాగణాధిపతయే నమః ॥

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ।
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ।
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ।
ఓం శచీపురందరాభ్యాం నమః ।
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ।
ఓం శ్రీ సితారామాభ్యాం నమః ॥
నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త-స్సుముహూర్తోఽస్తు ॥

శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ॥
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః ।

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు । భూత పిశాచాః । యే తే భూమిభారకాః । యే తేషామవిరోధేన । బ్రహ్మకర్మ సమారభే । ఓం భూర్భువస్సువః ।
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

ప్రాణాయామః
ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం స॒త్యమ్ ।
ఓం తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ॥

సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర-ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహం … మమ ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహకుటుంబస్య, క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్హ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ।

కలశ పూజ
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర-స్సమాహితః ।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః ॥

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వ్వీపా వసుంధరా ।
ఋగ్వేదోధ యజుర్వేద-స్సామవేదో-హ్యధర్వణః ॥
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ।

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥

ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః ।
(కలశోదకేన పూజాద్రవ్యాణి, ఆత్మానం, దేవం చ సంప్రోక్ష్య)

ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాం ఉప॒మశ్ర॑వస్తవమ్ । జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ నః॑ శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ॥

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయే నమః ।
అథ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే ।

షోడశోపచార పూజా

ప్రార్థన
భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ ।
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ॥

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ ।
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ॥

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ ।
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ॥

షోడసోపచార పూజా

ధ్యానం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ ।
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి ।

ఆవాహనం
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర ।
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి ।

ఆసనం
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ ।
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి ।

అర్ఘ్యం
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన ।
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి ।

పాద్యం
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక ।
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి ।

ఆచమనీయం
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత ।
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి ।

మధుపర్కం
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ ।
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి ।

పంచామృత స్నానం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ।
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి ।

శుద్ధోదక స్నానం
గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః ।
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ।

వస్త్రం
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ ।
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।

యజ్ఞోపవీతం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ ।
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।

గంధం
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ ।
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి ।

అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ ।
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి ।

పుష్పాణి
సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ ।
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి ।

అథాంగపూజా
ఓఓ గణేశాయ నమః – పాదౌ పూజయామి ।
ఓఓ ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి ।
ఓఓ శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి ।
ఓఓ విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి ।
ఓఓ ఆఖువాహనాయ నమః – ఊరూం పూజయామి ।
ఓఓ హేరంబాయ నమః – కటిం పూజయామి ।
ఓఓ లంబోదరాయ నమః – ఉదరం పూజయామి ।
ఓఓ గణనాథాయ నమః – నాభిం పూజయామి ।
ఓఓ గణేశాయ నమః – హృదయం పూజయామి ।
ఓఓ స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి ।
ఓఓ స్కందాగ్రజాయ ణమహ శ్కంధౌ పోఓజయామి ।
ఓఓ పాశహస్తాయ ణమహ హస్థౌ పోఓజయామి ।
ఓఓ గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి ।
ఓఓ విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి ।
ఓఓ శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి ।
ఓఓ ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి ।
ఓఓ సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి ।
ఓఓ విఘ్నరాజాయ నమః – సర్వాంగాణి పూజయామి ।

అథైకవింశతి పత్రపూజ
సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి (దర్భ) ।
గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి ।
ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి (మారేడు) ।
గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి(గరిక) ।
హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త) ।
లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి (రేగు) ।
గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి) ।
గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి ।
ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి (ఆమ్ర) ।
వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి (గన్నేరు)।
భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి ।
వటవేనమః – దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ) ।
సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి ।
ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి ।
హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి ।
శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి ।
సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి ।
ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి (జమ్మి) ।
వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి (రావి) ।
సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి (మద్ది) ।
కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి (జిల్లేడు) ।
శ్రీ గణేశ్వరాయ నమః – ఏకవింశతి పత్రాణి పూజయామి ।

ఏకవింశతి పుష్ప పూజా
ఓం పంచాస్య గణపతయే నమః – పున్నాగ పుష్పం సమర్పయామి ।
ఓం మహా గణపతయే నమః – మందార పుష్పం సమర్పయామి ।
ఓం ధీర గణపతయే నమః – దాడిమీ పుష్పం సమర్పయామి ।
ఓం విష్వక్సేన గణపతయే నమః – వకుళ పుష్పం సమర్పయామి ।
ఓం ఆమోద గణపతయే నమః – అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి ।
ఓం ప్రమథ గణపతయే నమః – పాటలీ పుష్పం సమర్పయామి ।
ఓం రుద్ర గణపతయే నమః – ద్రోణ పుష్పం సమర్పయామి ।
ఓం విద్యా గణపతయే నమః – ధత్తూర పుష్పం సమర్పయామి ।
ఓం విఘ్న గణపతయే నమః – చంపక పుష్పం సమర్పయామి ।
ఓం దురిత గణపతయే నమః – రసాల పుష్పం సమర్పయామి ।
ఓం కామితార్థప్రద గణపతయే నమః – కేతకీ పుష్పం సమర్పయామి ।
ఓం సమ్మోహ గణపతయే నమః – మాధవీ పుష్పం సమర్పయామి ।
ఓం విష్ణు గణపతయే నమః – శమ్యాక పుష్పం సమర్పయామి ।
ఓం ఈశ గణపతయే నమః – అర్క పుష్పం సమర్పయామి ।
ఓం గజాస్య గణపతయే నమః – కల్హార పుష్పం సమర్పయామి ।
ఓం సర్వసిద్ధి గణపతయే నమః – సేవంతికా పుష్పం సమర్పయామి ।
ఓం వీర గణపతయే నమః – బిల్వ పుష్పం సమర్పయామి ।
ఓం కందర్ప గణపతయే నమః – కరవీర పుష్పం సమర్పయామి ।
ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః – కుంద పుష్పం సమర్పయామి ।
ఓం బ్రహ్మ గణపతయే నమః – పారిజాత పుష్పం సమర్పయామి ।
ఓం జ్ఞాన గణపతయే నమః – జాతీ పుష్పం సమర్పయామి ।

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా
ఓం గణాధిపాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం పాశాంకుశధరాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఆఖువాహనాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం వినాయకాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఈశపుత్రాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఏకదంతాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఇభవక్త్రాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం మూషకవాహనాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కుమారగురవే నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కపిలవర్ణాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం బ్రహ్మచారిణే నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం మోదకహస్తాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సురశ్రేష్ఠాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం గజనాసికాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కపిత్థఫలప్రియాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం గజముఖాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సుప్రసన్నాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సురాగ్రజాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఉమాపుత్రాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం స్కందప్రియాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి ।

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి ।

శ్రీ వినాయక అష్టోత్తరశత నామ పూజా
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః (10)
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః (30)
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః (40)
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధాయ నమః
ఓం సర్వవంద్యాయ నమః (50)
ఓం నర్వసిద్ది-ప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసుర-భంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః (60)
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః (70)
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంత-పదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః (80)
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్క్షిప్త-వారణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః (90)
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః (100)
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షా-విధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
శ్రీ మహాగణాధిపతయే నమః ।
నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి ।

ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ ।
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి ।

దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా ।
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి ।

నైవేద్యం
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ ।
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ॥
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ।
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి ।

తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ ।
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి ।
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి ।

నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి ।
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ।

మంత్రపుష్పం
గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన ।
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ॥
ఏకదంతైకవదన తథా మూషకవాహన ।
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి ।

ప్రదక్షిణం
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ ।
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ॥
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక ।
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ॥
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।

సాష్టాంగ నమస్కారం
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే ।
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ ।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ॥
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే ।
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి ।

ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక ।
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ॥
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ ।
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ।

రాజోపచార పూజా
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । ఛత్రమాచ్ఛాదయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । చామరైర్వీజయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । గీతం శ్రావయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । నృత్యం దర్శయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । వాద్యం ఘోషయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । ఆందోళికాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । అశ్వాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । గజాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ।

పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక ।
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక ।
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే ।
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక ।
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

సమర్పణం
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥

అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ।

విఘ్నేశ్వర కథా

పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను, బోధిస్తున్న సూత మహామునిని దర్శించి, నమస్కరించి ”రుషివర్యా! మేము రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు… వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.  ”ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ, విజయాలనూ, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి” అని కోరాడు.


అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్ధ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొక టుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గానీ, వెండితోగానీ, మట్టితోగానీ, విఘ్నేశ్వ రుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి.  అందులో గణశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధా క్షతలు, పుష్పాలు, పత్రా లతో పూజించి, ధూపదీపా లను, వెలగ, నేరేడు మొదలైన ఫలము లను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనా దులతో పూజను ముగించి, యధాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య, భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పున: పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాం బూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతా ల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేతా ఆచరింపబడింది” అని పరమ శివుడు కుమారస్వామికి చెప్పాడు.  కనుక ధర్మరాజా! నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువు లను జయించి సమస్త సుఖాలనూ పొం దుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నల మహారాజును పెళ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామ ణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను” అంటూ ఇలా చెప్పసాగాడు. 

”పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోర కోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందే నివసిం చాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతీదేవి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించు కునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంక రించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురా నికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజా సురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి. ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయ మనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్లగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్లాడు..

రుషిపత్నులకు నీలాపనిందలు

ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ, తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు రుషి పత్నులను మోహించి, శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక, మిగిలిన రుషిపత్నుల రూపం ధరించి పతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్య లేయని శంకించి, రుషులు తమ భార్యలను విడనాడారు. రుషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది.  రుషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలూ, మునులూ పరమేశ్వరునికి తెలుప గా, అతడు అగ్నిహోత్రుని భార్యయే రుషిపత్నుల రూపం ధరించిందని చెప్పి రుషు లను సమాధారపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. అంత దేవాదులు ‘పార్వతీ, నీ శాపం వల్ల ముల్లోకాలకూ కీడు వాటిల్లుతోంది. ఉపసంహరించుకోవా’ లని ప్రార్థించారు. వినాయకచవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీర ప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి ‘అయ్యో నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు. ఒక సింహం దాన్ని మాంస ఖండమనుకుని అతణ్ణి చంపి మణిని తీసుకుపోతుంది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, మణిని, తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది.ఆ తరువాత మణికోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు తన పట్టణంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు, చవితి చంద్రుణ్ణి చూసిన దోష ఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి వెదకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహ లోపలికి వెళ్లి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్యా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని ”దేవా త్రేతాయుగంలో నామీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యు ద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పట్నుంచీ మీ నామస్మరణ చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది” అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు ‘శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణికోసం ఇలా వచ్చాను. ఇవ్వ’మని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతినీ కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్నపెద్దలను ఒకచోట చేర్చి యావత్‌ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు ”అయ్యో, లేనిపోని నింద మోపి తప్పుచేశా”నని విచారించి, మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, క్షమించ”మని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతి, సత్యభామలను పరిణయమాడాడు. దేవాదులు, మునులు, కృష్ణుణ్ణి స్తుతించి ‘మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొన్నారు. మా పరిస్థితి ఏంటి’ అని అడగ్గా భాద్రపద శుద్ధ చతుర్ధినాడు ప్రమాదవశాత్తూ చంద్రుణ్ణి చూసినవాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథను విని, అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు’ అని చెప్పాడు కృష్ణుడు.  అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధినాడు దేవతలూ, మహర్షులూ మానవులూ తమతమ శక్తి కొద్దీ గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో ఉన్నారు.  ఈ కథ చదివినవారు, విన్నవారు, ఈ కథ చదువుకొని అక్షతలు నెత్తిమీద వేసుకున్నవారు ఈ రోజు చంద్రుడిని చూసినా ఎటువంటి దోషం ఉండదు.  ఆ తర్వాత వరసిద్ధి వినాయకునికి మంగళహారతి ఇవ్వాలి.

వినాయక మంగళాచరణం (తెలుగు)

ఉ ॥ తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిను ప్రార్ధన జేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!

క ॥ తలచితినే గణనాథుని
తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని
దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్

అటుకులు కొబ్బరి పలుకులు
చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్
నిటలాక్షునగ్ర సుతునకు
పటుకరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య – ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు ।
కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును – బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు
। జయ మంగళం నిత్య శుభ మంగళమ్ ।

వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు – కొండలుగ నీలములు కలియబోసి ।
మెండుగను హారములు మెడనిండ వేసికొని – దండిగా నీకిత్తు ధవళారతి ॥ జయ ॥

శ్రీమూర్తివంద్యునకు చిన్మయానందునకు – భాసురస్తోత్రునకు శాశ్వతునకు ।
సోమార్కనేత్రునకు సుందరాకారునకు – కామరూపునకు శ్రీ గణనాధునకును ॥ జయ ॥

ఏకదంతంబును ఎల్లగజవదనంబు – బాగయిన తొండంబు వలపు కడుపు ।
జోకయున మూషికము సొరిదినెక్కాడుచును – భవ్యుడగు దేవగణపతికి నిపుడు ॥ జయ ॥

చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను ।
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ॥జయ ॥

Article Categories:
Ganesh Chaturthi

Leave a Reply